13 May, 2026 | 1:51 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

గ్యాస్, చమురు నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పండి

20-03-2026 01:21 AM

ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ, మార్చి 19: ఇజ్రాయోల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ప్రపంచ దే శాలు ఉక్కిరిబిక్కిరి ఆవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఆందోళన నెలకొం ది. దేశంలో ఇంధన, గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది.

దేశంలోని చము రు, గ్యాస్ కంపెనీల వద్ద ఉన్న నిల్వలు, ఉత్ప త్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చే సింది. ఈ మేరకు దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, సహజవాయువు సరఫరా గొలుసును పర్యవేక్షించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ జారీచేసింది. ఆయా కంపెనీలు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ)కు ఈ వివరాలను పంపించాల్సి ఉంటుంది.  

ఇరాన్‌లో వెయ్యి మంది..

సుమారు వెయ్యి మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నారని విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి కేంద్రం వెల్లడించింది. కా గా ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతా ల్లోని 23 వేల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాయలేకపోయారని పేర్కొంది.