అన్ని శాఖల నుంచి సమాధానాలు పంపించండి
ఉన్నతాధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : ఈనెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున ఇప్పటి వరకు వచ్చిన ప్రశ్నలకు సంబంధించిన స మాధానాలు వెంటనే సమర్పించాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు రావాల్సిన సమాధానాలు, సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వ కార్యదర్శులతో సీఎస్ శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
సీఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ శా సన మండలి, శాసనసభ సమావేశాల నేపథ్యంలో సభ్యు లు అడిగిన ప్రశ్నలన్నింటికీ నేటిలోగా సమాధానాలు పంపించాలన్నా రు. ప్రధానంగా, నీటిపారుదల, వైద్య ఆరో గ్య శాఖ, మున్సిపల్ పరిపాలన, ఇంధనశాఖ, రెవిన్యూ తదితర శాఖలకు సంబం ధించి వెంటనే సమాధానాలు పంపాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తో ప్రారంభమవుతాయన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై డిప్యూటీ సీఎం ఆదివా రం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారన్నారు.




