14 March, 2026 | 7:45 AM

రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలి

14-03-2026 02:26 AM

ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడాలి

పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి

టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

పార్టీ నాయకులకు దిశానిర్దేశం

హనుమకొండ, మార్చి 13 (విజయక్రాంతి): రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలని, ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న అన్నారు. హనుమకొండలోని రెడ్డికాలనీ, శారద గార్డెన్స్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ముఖ్య నాయకులతో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖాముఖి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ కార్యక లాపాలు, స్థానిక ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ విస్తరణ, గ్రామస్థాయిలో కార్యకర్తల బలోపేతం, ప్రజల్లో పార్టీ పై విశ్వాసాన్ని మరింత పెంపొందించడం, రాబోయే రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు.

నాయకులు తమ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన తీన్మార్ మల్లన్న పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కా రానికి పోరాడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు బలమైన టీమ్ గా పనిచేస్తేనే పార్టీ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మరింత బలపేతం అవుతుందన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కా రం కోసం పోరాడే రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలని, అందుకోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సా గాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.