15 May, 2026 | 1:27 AM

రేడియల్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వండి

15-05-2026 12:22 AM

రైతులను కోరిన ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి 

మహేశ్వరం, మే 14 (విజయక్రాంతి): రేడియల్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వాలని కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి రైతులను కోరారు. రేడియల్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చే రైతులకు సరైన పరిహారం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

మహేశ్వరం మండలం కొంగరఖుర్డు రెవెన్యూ గ్రామాల పరిధిలో రేడియల్ రోడ్ కోసం భూములు సేకరిస్తున్నందున, సదరు రైతులతో గురువారం జిల్లా పరిషత్ హై స్కూల్ రావిర్యాలలో రెవెన్యూ డివిజనల్ ఆదికారి కందుకూరు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వాయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో రైతులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.భూమి సేకరిస్తున్న రెడీయల్ రోడ్ విషయం మరియు ప్రాముఖ్యత రైతులకు/ప్రజలకు వివరించి,  రైతుల సందేహలను నివృత్తి చేశారు.రైతు అభిప్రాయాలు మరియు భూసేకరణ చట్టం 2013 అనుసరించి తగు న్యాయం చేస్తామని అన్నారు. భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం లభిస్తుందని ఆయన రైతులకు సూచించారు. ఈ గ్రామ సభలో డిటి రాజు, మహేశ్వరం గిర్థవార్ రాజు రెడ్డి, కొంగరకూర్డ్ జిపిఓ అరుణ్ కుమార్, హెచ్‌ఎండిఏ  అధికారులు రాజివ్,దివ్య రెడ్డిలు పాల్గొన్నారు.