15 May, 2026 | 1:23 AM

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి

15-05-2026 12:22 AM

జెడి ఏ ఉషారాణి

జవహర్‌నగర్, మే 14 (విజయక్రాంతి): విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో ముందుకు సాగాలని జెడి ఏ ఉషారాణి పేర్కొ న్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్‌నగర్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమం గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, పేరెంటు టీచర్ మీటింగ్ (పిటిఎం) కార్యక్ర మం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా జెడి ఏ ఉషారాణి జవహర్‌నగర్‌ను సంద ర్శించారు. ఎంపీపీఎస్ జవహర్‌నగర్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాప్రా ఎంఈఓ నరసింహులు, జడ్పిహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ అజముద్దీన్, ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయులు నరేందర్, ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.