18 August, 2026 | 4:47 AM

సల్లంగాచూడు నాగమ్మతల్లి

18-08-2026 12:00 AM

సుల్తానాబాద్‌లో వైభవంగా నాగుల చవితి వేడుకలు

సుల్తానాబాద్ ఆగస్టు 17 (విజయ క్రాంతి): సల్లంగా చూడు నాగమ్మ తల్లి అం టూ భక్తులు పుట్టలో పాలు పోసి నాగమ్మ తల్లిని వేడుకున్నారు. భక్తిశ్రద్ధలతో పుట్టలో పాలు పోసి నాగుల చవితి వేడుకలను భక్తులుఘనంగా జరుపుకున్నారు. సోమవా రం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం తోపాటు మండలంలోని గ్రామాల్లోనూ నాగుల చవితి వేడుకల సందర్భంగా పలు దేవాలయాల్లో ఉన్నటువంటి నాగుపాము పుట్టల్లో మహిళలు పాలు పోసి , పండ్లు నైవేద్యం గా సమర్పించి మోక్కులుచెల్లించుకున్నారు, తెల్లవారుజాము నుండే దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.ఈ సందర్భంగా శివాలయాల్లో అర్చకులు శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు..