12 March, 2026 | 6:34 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

రోడ్ సెక్టార్ పాలసీకి ప్రణాళికలు సిద్ధం చేయాలి

12-03-2026 01:54 AM
  1. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక రింగ్ రోడ్
  2. దీనిపై అధికారులు అధ్యయనం చేయాలి
  3. రోడ్లు, భవనాల శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): రోడ్ సెక్టార్ పాలసీ- 2047కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగ్ రోడ్ అభివృద్ధి చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

బుధవారం సీఎం నివాసంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి సీఎం సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలన్నారు.

ఇప్పటికే గుర్తించిన ఏరియాల్లో రోడ్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టేందుకు అవసర మైన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాలతో సమీక్ష నిర్వహించి స్పష్టమైన విధానం తో ముందుకు వెళ్లాలన్నారు. ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగ్ రోడ్ అభివృద్ధి చేసే అంశాన్ని అధికారులు అధ్యయనం చేయాలని తెలిపారు.

ఆ రింగ్ రోడ్లను హైవేలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించా లని, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా హాస్పిటల్స్ భవనాల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు.