12 March, 2026 | 2:27 PM

Breaking News

మళ్లీ తెరపైకి మద్యం కేసు.. కవిత ఇంటికి సీబీఐ అధికారులు   •   నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే   •   భారత్‌కు ఊరట.. ఆయిల్ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి   •   అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి   •   పోలీస్ భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు   •   పెళ్లికి వెళ్తుండగా వాహనం బోల్తా.. ఇద్దరు మృతి   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి   •   గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి   •   గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి   •   గాజులపేట కాలనీలో నీటి సమస్యకు పరిష్కారం   •  

ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తోన్న శాసన వ్యవస్థ

12-03-2026 01:56 AM

కేంద్రమంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): కన్నతల్లే బిడ్డను చంప డం ఎంత పాపమో.. శాసన వ్యవ స్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపమని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ల ను డిస్‌మిస్ చేయడం దారుణమని బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీచేసినా అనర్హత వేటు వర్తించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. సీఎం దీనిపై వెంటనే స్పందించాలని, శాసనవ్యవస్థపై ప్రజలకు పూర్తిగా నమ్మకం కోల్పోయేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని ఆందోళన వ్యక్తంచేశారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని, న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.