12 March, 2026 | 8:33 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అలీప్ ఆరోహి చైల్డ్ కేర్ సెంటర్

12-03-2026 01:53 AM

యూఎన్‌డీపీ సహకారంతో ఏర్పాటు

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సమ్మిళిత పట్టణ సంరక్షణ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించే దిశగా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రిన్యూయర్ ఆఫ్ ఇండియా (అలీప్).. అంత ర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రగతి నగర్‌లోని అలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో యూఎన్‌డీపీ -మద్దతు గల అలీప్ ఆరోహి చైల్డ్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించింది.

యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) ఇండియా నివాస ప్రతినిధి ఏంజెలా లుసిగి, ప్రభుత్వం, పరిశ్రమ, అభివృద్ధి సంస్థలు, వ్యవస్థాపక పర్యా వరణ వ్యవస్థ నుంచి ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. ‘బలోపేతం చేయబడిన పట్టణ సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ద్వారా మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచ డం’ అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రారంభించారు. శ్రామిక మహిళలు ఎదుర్కొం టున్న కీలక అడ్డంకులలో ఒకటైన - కార్యాలయానికి సమీపంలో సురక్షితమైన, నమ్మద గిన, సరసమైన పిల్లల సంరక్షణ సౌకర్యాలను పొందడం లక్ష్యంగా ఏర్పాటు చేశారు.

చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలలో పనిచేసే చంటి పిల్లల తల్లులకు కార్యాలయ ఆధారిత చైల్డ్ కేర్ సౌకర్యంగా రూపొందించారు. పెడగోజీ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ కింద కొండాపూర్‌లోని ఐవీ బ్లూమ్స్ ప్రీస్కూల్ వ్యవస్థా పకురాలు స్లోకా చలసానితో ఆరోహి చైల్డ్‌కేర్ సెంటర్‌కు సాంకేతిక భాగస్వామిగా ఒప్పం దం కుదుర్చుకున్నారు. ఈ కేంద్రంలో పిల్లల అభ్యాస స్థలాలు, ఆట స్థలాలు,

వయస్సుకు తగిన విద్యా సామగ్రి, శిక్షణ పొందిన సంరక్షకులు ఉన్నారు.  కార్యక్రమంలో అలీప్ అధ్య క్షురాలు, ఏఐసీ అలీప్ వీ హబ్ సీఈవో ర దేవి కన్నెగంటి, ది డిప్లొమాటిక్ క్లబ్ గ్లోబల్ ప్రెసిడెంట్ డాక్టర్ మూర్తి దేవరభోట్ల, గ్రీన్టా ట్వా అగ్రి టెక్ ఎల్‌ఎల్‌పీ వ్యవస్థాపకురాలు, న్యాయవాది రూప మగంటి, పరిశ్రమ ల కమిషనరేట్ జాయింట్ డైరెక్టర్ కూచిపూడి మధుకర్ బాబు, ఎస్‌ఈఆర్‌పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.