06-02-2026 05:08:21 PM
మండల ప్రత్యేక అధికారి జీవరత్నం
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగం పెంచాలని, ఖానాపూర్ మండల ప్రత్యేక అధికారి ముఖ్య ప్రణాళికాధికారి జీవరత్నం అన్నారు. శుక్రవారం మండలంలోని కొలాం గూడా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పరిశీలించారు. నిర్మాణంలో జాప్యం చేయకూడదని ప్రభుత్వం నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్న నేపథ్యంలో నిర్మాణం కూడా అదే విధంగా సాగాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఖానాపూర్ ఎంపీడీవో బి రమాకాంత్, ఎంపీఓ సి హెచ్ రత్నాకర్ రావు ,పంచాయతీ సెక్రెటరీ తదితరులు ఉన్నారు.