10 April, 2026 | 3:24 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం సాధ్యం

10-04-2026 01:25 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా జయించవచ్చని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. శుక్రవారం  యోగ ఫర్ వన్ ఎర్త్ – వన్ హెల్త్  నినాదంతో కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా ఒక సమగ్ర పరిష్కారమని అన్నారు. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానమని, దీన్ని ప్రతిరోజూ ఆచరించడం ద్వారా శరీరానికి దృఢత్వం, మనసుకు ప్రశాంతత లభిస్తాయని అన్నారు.

యోగా ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందడమే కాకుండా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు.  యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభించడం వల్ల వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం మొత్తానికి సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.  జిల్లాలో యోగా పట్ల అవగాహన పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిన్న వయస్సు నుంచే యోగా అలవాటు చేయడం అత్యంత అవసరమని తెలిపారు. యోగా సాధన వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, మానసిక స్థిరత్వం పెరుగుతాయని అన్ని అన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఉదయం పాఠాలు ప్రారంభానికి ముందు యోగా నిర్వహణను చేపట్టాలని అన్నారు .ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీఆర్‌డీఓ దత్తారావు, వైద్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.