04-02-2026 07:33:45 PM
ఎమ్మెల్యే కు విన్నవించిన మహిళలు.
సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో నిర్వహిస్తున్న వైన్ షాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాలనీకి చెందిన మహిళలు, ప్రజలు బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం అందజేశారు. నిత్యం షాపు పరిసర ప్రాంతాల్లో తాగి తిరుగుతూ అటువైపు వెళ్లే మహిళలను కామెంట్ చేస్తున్నారని వారు మోర పెట్టుకున్నారు. రాత్రి సమయంలో వైన్స్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే భయం వేస్తుందని వెంటనే ఆ వైన్స్ పై నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యను పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.