సెంటీనరీ కాలనీ రోడ్డుప్రమాదం.. వ్యక్తి మృతి
సెంటీనరీ కాలనీ రోడ్డు ప్రమాదంలో కల్వచర్లకు చెందిన మహిళా గాని కిరణ్ మృతి
రామగిరి, జూలై 20 (విజయక్రాంతి): రామగిరి మండలంలోని పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై(Peddapalli–Manthani Main Road) సెంటీనరీ కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన మహిళా గాని కిరణ్ యాదవ్ మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో కిరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి గాయాలు కాగా, అతడు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిరణ్ మృతితో కల్వచర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.






