17 March, 2026 | 4:00 AM

ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

17-03-2026 02:44 AM

హైదరాబాద్ కలెక్టర్ హరిచందన

సికింద్రాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరిచందన దాసరి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.జితేందర్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి  ఈ.వెంకటాచారి లతో  కలిసి ప్రజల అర్జీలను  స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం ప్రజావాణి, వాట్సప్ ప్రజావాణి దరఖాస్తుల కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్ లేకుం డా చూడాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 331 అర్జీ లు అందాయని వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవోలు రామకృష్ణ, సాయిరాం, పిడి హౌసింగ్ అశోక్ చక్రవర్తి, సిపిఓ డాక్టర్ సురేందర్, జిఎం పరిశ్రమలు పవన్ కుమార్, సంక్షేమ అధికారులు జి ఆశన్న, ప్రవీణ్ కుమార్, కోటాజి, ఇలియాస్ అహ్మద్, ఏవో విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.