13 July, 2026 | 5:27 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

పీపుల్స్ హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ శిబిరం

08-01-2026 05:14 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం రామ్ రెడ్డి పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ లఫంగినర్సింహా ఆధ్వర్యంలో మాల్ పట్టణ పీపుల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో గురువారము వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ క్యాంపులో మహిళలకు, గర్భిణీలకు, పెద్దలకు, పిల్లలకు సంబంధిత ప్రాథమిక వైద్య సేవలను డాక్టర్లు అందజేశారు. అత్యవసర పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు రోగులు హాజరయ్యి చికిత్స పొందాలని తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచి లపంగి నరసింహ మాట్లాడుతూ, గ్రామంలో లోని ప్రతి ఒక్కరు ఈ శిబిరాన్ని సద్వినియోగంపరచుకొని, అందరూ ఆరోగ్య వంతులుగా ఉండాలనీ, అదేవిధంగా అత్యవసర సేవలందించడానికి అంబులెన్స్ సౌకర్యాలు కూడా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు ఉన్నాయని గ్రామస్తులకు తెలిపారు. అనంతరం క్యాంపులో పీపుల్స్ హాస్పిటల్ సంబంధించిన క్యాలెండర్ను కూడా ఆవిష్కరించారు.