23 July, 2026 | 1:54 AM

ఎంపీ కార్యాలయంపై దాడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి

23-07-2026 12:57 AM

కరీంనగర్ క్రైం, జూలై 22 (విజయ క్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. బండి సంజయ్ కుమార్ కార్యాలయంపై దాడికి యత్నించిన మానకొండూర్ ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీజేపి నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం సీపీ గౌస్ ఆలంకు వినతిపత్రం సమర్పించారు. పార్లమెంట్ కార్యాలయంలోకి అక్ర మంగా చొరబడి కార్యాలయంపై, బీజేపీ నా యకులపై దాడికి యత్నించిన కాంగ్రెస్ నా యకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.