కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
ప్రజలకు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు, బీజేపీ కంటోన్మెంట్ బోర్డ్ సభ్యురాలుకు నిరసన సెగ..
సికింద్రాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని స్థానిక అంబేద్కర్ హట్స్ నివాసితుల నుంచి ఎమ్మెల్యేతో పాటు బీజేపీ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్కు నిరసన సెగ తగిలింది. బుధవారం ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులను కలుసుకునేందుకు వెళ్లిన వీరిని బాధితులు ఒక్కసారిగా నిలదీశారు.
40 ఏళ్ల నుంచి అంబేద్కర్ హాట్స్ లో నివసిస్తున్న పేదల ఇంటిపైకి బుల్డోజర్ తో కూల్చేస్తామనికంటోన్మెంట్ అధికారులు హెచ్చరించారు..రెక్కాడితే గానీ డొక్కాడనీ పేద ప్రజలు పై ఎందుకు ఇంత కోపమని ప్రశ్నిస్తూ, తమ నివాసాలను కూల్చివేస్తే ఎవరు బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దీంతో బస్తీ వాసులకు అండగా నిలిచిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పోరాడే సరికి నేడు కలిసి పర్యటించిన బీజేపీ కంటోన్మెంట్ బోర్డ్ సభ్యురాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ను స్థానిక ప్రజలు నిరదీశారు.దీనిపై ఎమ్మెల్యే, బోర్డు సభ్యురాలు నర్మద సానుకూలంగా స్పందించారు. బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.






