calender_icon.png 11 February, 2026 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు

11-02-2026 12:33:29 AM

టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్ కుమార్ 

మహబూబ్ నగర్ టౌన్, ఫిబ్రవరి 10: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డ్రామాలను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు గమనిస్తున్నారని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఖైరతాబాద్ ఇన్చార్జీ ఎస్.వినోద్ కుమార్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే మాజీ మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

మీ హయాంలో అధికారులు, పో లీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అధికారులు, పోలీసులు వి ధినిర్వహణనను స్వేచ్ఛగా చేసుకుంటున్నారని అన్నారు. 75 ఏళ్ల రాజకీయ చరిత్రలో మీ పాలనలో పెట్టిన తప్పుడు కేసులు అంద రికి తెలుసనని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా. జరగడానికి అధికారులు చర్యలు తీ సుకుంటున్నారన్నారు.

ప్రజలు ప్రతి ఒక్కరూ స్వేచ్చగా ఓటు వినియోగించుకోవాలని కో రారు. పట్టలు ప్రజలు మాజీ మంత్రి మాటలను పట్టించుకోవదన్నారు. ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసే, రెచ్చగొట్టే ప్రకటనలు బీఆర్‌ఎస్ నాయకులు చేయవద్దని హితవుపలికారు. సమావేశంలో నాయకులు ము న్నూరు రవి,తదితరులు పాల్గొన్నారు.