11-02-2026 12:33:58 AM
డిచ్‌పల్లి, ఫిబ్రవరి10 (విజయక్రాంతి): కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పూణే ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్కు తెలంగాణ యూనివర్సిటీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఎంపికై మంగళవారం పూణేకు బయలుదేరారు. ఈ శిబిరం ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో జరగనుంది.
ఈ బృందానికి జీజీ కాలేజ్ నిజామాబాద్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రా మ్ ఆఫీసర్ దస్తప్ప కంటింజెంట్ లీడర్గా వ్యవహరిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఆచార్య అపర్ణ తెలిపారు. బృందంలో తెలంగాణ యూనివర్సిటీతో పాటు గవర్నమెంట్ గిరిరాజు కాలేజ్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ దాస్నగర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, నిషిత డిగ్రీ కాలేజ్, ఆర్కే డిగ్రీ కాలేజ్, ఉషోదయ డిగ్రీ కాలేజ్ బోధన్కు చెందిన వాలంటీర్లు ఉన్నారు.
వారం రోజులపాటు కొనసాగే ప్రత్యేక శీతాకాల శిబిరంలో వాలంటీర్లు వివిధ సాంస్కృతిక, సామాజిక, విద్యా కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ సమగ్రతపై అవగాహన పెంపొందించుకోనున్నారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ ఆచార్య టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఆచార్య అపర్ణ మాట్లాడుతూ అధికారులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ, శిబిరంలో పాల్గొంటున్న వాలంటీర్లు ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. అలాగే ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ డైరెక్టరేట్ హైదరాబాద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.