12 August, 2026 | 5:21 PM

ఖానాపూర్ లో అట్టహాసంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

12-08-2026 04:19 PM

భారతదేశ సమైక్యతను కాపాడాలి

బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో హర్ గర్ తిరంగా ర్యాలీ అట్టహాసంగా సాగింది. బిజెపి అధిష్టానం ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుంచి వందలాదిమంది విద్యార్థులతో ఈ ర్యాలీ సాగింది. అనంతరం తెలంగాణ చౌక్ వద్ద సమావేశం ఏర్పాటు చేసి వక్తలు మాట్లాడారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ మాట్లాడుతూ దేశ సమైక్యతకు విద్యార్థులు నడుము కట్టాలని రాబోవు భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని అన్నారు.

దానికోసం కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో సమస్యలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నామని మన వంతు కృషి స్థానికంగా ఉన్న ప్రతి సమస్యను సాధించుకోవడం అభివృద్ధిలో ముందుకు సాగిపోవడమేనని అన్నారు .ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి అంకం మహేందర్, రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్, జిల్లా బాధ్యులు పడాల రాజశేఖర్, తోకల బుచ్చన్న ,మనోజ్, తదితరులు ఉన్నారు.