25 March, 2026 | 3:23 PM

Breaking News

పోగొట్టుకున్న ఫోన్లని బాధితులకి అప్పగించిన ఎస్సై   •   పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదు.. సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు   •   పొంచి ఉన్న ప్రమాదం   •   గురుకుల ప్రవేశ పరీక్షలో శ్రీవిద్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం   •   బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం   •   పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •  

పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన

25-03-2026 01:34 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టం-2025ను కేంద్రం తక్షణమే రద్దు  చేయాలంటూ బుధవారం  మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్లు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ పెన్షన్ విధానంతో తీవ్ర నష్టం కలుగుతుందని పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షుడు సంతోష్ అన్నారు.

జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వాత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించి, వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పెండింగ్ డిఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య, రమేష్ గౌడ్ సంఘీభావం తెలిపారు. అనంతరం తహశీల్దార్ దయానందంకు మండల పెన్షనర్స్ వినతిపత్రం అందించారు.