17 June, 2026 | 3:01 PM

న్యాయవాదుల హెల్త్ కార్డుల కోసం మహా ధర్నాకు పిలుపు

17-06-2026 01:29 PM

ఇల్లందు, జూన్ 17 (విజయక్రాంతి): ఇల్లందు కోర్టు ఆవరణలో బుధవారం ఆల్ ఇండియా లాయర్ యూనియన్ (ఏయూఎల్యూ) కమిటీ అధ్యక్షుడు సుడిగాలి వెంకట నరసయ్య, ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూక్యా రవికుమార్ నాయక్ ఆధ్వర్యంలో న్యాయవాదుల హెల్త్ కార్డుల సాధన కోసం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 20న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.