25 March, 2026 | 3:10 PM

Breaking News

పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదు.. సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు   •   పొంచి ఉన్న ప్రమాదం   •   గురుకుల ప్రవేశ పరీక్షలో శ్రీవిద్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం   •   బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం   •   పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •  

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

25-03-2026 01:57 PM

42 ఏళ్ల కాంగ్రెస్ బంధానికి జీవన్ రెడ్డి గుడ్ బై

కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి  రాజీనామా 

నాకు పోరాటం కొత్త కాదు.. రేవంత్ రెడ్డిపైనా పోరాటం చేస్తా

హైదరాబాద్: జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి(Jeevan Reddy) పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. 42 ఏళ్ల కాంగ్రెస్(Congress Party) బంధానికి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అండగా ప్రభుత్వం లేదు.. పార్టీ లేదన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ ఏమైంది? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తనకు పోరాటం కొత్త కాదన్న జీవన్ రెడ్డి చంద్రబాబు, కేసీఆర్ తో పోరాడానని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పోరాటానికి కూడా సిద్ధమేనని సవాల్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ తనదని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. రెండేళ్లు అవమానంతోనే గడిచింది.. ఆత్మగౌరవ పోరాటం చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేద్దామని బుజ్జగించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఓపిక పట్టాలని కోరారు.. ఇంకా ఎంతకాలం ఓపిక పట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పార్టీ మారాలనే ఆలోచన లేదన్న జీవన్ రెడ్డి తనను ఏ గుర్తింపు లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో తన ఉనికి ఉండకూడదని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.