పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలం
రైతులకు ఎలాంటి కొరత లేకుండా పకడ్బందీగా ఎరువుల సరఫరా
త్వరలో తిరిగి ప్రారంభం కానున్న యూరియా బుకింగ్ యాప్
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జూన్ 17(విజయక్రాంతి): ప్రస్తుత వానాకాలం-2026 సీజన్‌కు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
నిల్వల వివరాలు
జిల్లాలో ప్రస్తుతం 18,750 మెట్రిక్ టన్నుల యూరియా (సుమారు 4,12,511 బస్తాలు) నిల్వ ఉందని,
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ఇతర కంపెనీల నుంచి ప్రతి వారం నిల్వలు నిరంతరంగా అందుతున్నాయని అన్నారు.
రైతులకు కలెక్టర్ భరోసా
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడంతో, విత్తన ప్రక్రియ మందగించిందని, అందువల్లనే యూరియా బుకింగ్ యాప్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కలెక్టర్ వివరించారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఈ యాప్‌ను తిరిగి అందుబాటులోకి తెస్తామని, రైతులు ఎవరూ ఎరువుల లభ్యతపై ఆందోళన చెందవద్దని ఆయన కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఎరువుల సరఫరా పకడ్బందీగా జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.






