calender_icon.png 23 February, 2026 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

23-02-2026 12:19:34 AM

జగిత్యాల, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): పెన్షనర్ల  పెండింగ్ లో ఉన్న  సమస్యలను యుద్ధ ప్రాతిపదికగా పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. టి. పి. సి. ఏ. జగిత్యాల జిల్లా శాఖ  జిల్లా స్థాయి సమావేశం అసోసియేషన్ కార్యాలయం లో నిర్వహించగా పెన్షనర్ల సర్వీస్ రూల్స్ పుస్తకాలను సభ్యులకు హరి అశోక్ కుమార్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గత రెండేళ్లుగా రిటైర్ అయిన వారికి నేటికీ ప్రయోజనాలు అందక పోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 

దీర్ఘ కాలంగా అమలుకు నోచుకోని డి. ఎ. లు, పీ అర్సీ, తదితర డిమాండ్లను తమ రాష్ట్ర అధ్యక్షులు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సచివాలయం లో కలిసి విన్నవించమన్నారు. వృద్ధాప్యం లో ఉన్న పెన్షనర్లు పోరుబాట పట్టకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వం పై ఉందన్నారు.

ఈ సమావేశం లో  టి. పి. సి. ఏ. జిల్లా ప్రధాన కార్యదర్శి పి. హన్మంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ పెన్షనర్ల జిల్లా అధ్యక్షులు గౌరి శెట్టి విశ్వనాతం,  వెలముల ప్రకాష్ రావు,  కోరుట్ల అధ్యక్షులు పబ్బా శివానందం, జగిత్యాల యూనిట్ అధ్యక్షులు బి. రాజేశ్వర్,మెట్ పల్లి అధ్యక్షులు మురళి, మల్యాల అధ్యక్షులు ఎం. డి. యాకూబ్, రాయికల్ అధ్యక్షులు వేణు గోపాల్ రావు, ధర్మపురి అధ్యక్షులు కే. గంగాదర్, తదితరులు పాల్గొన్నారు.