calender_icon.png 23 February, 2026 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ యాంత్రీకరణ పథకం సద్వినియోగం చేసుకోవాలి

23-02-2026 12:20:02 AM

కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ 

జనగామ, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): 50 శాతం రాయితీతో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరములు జిల్లాలో అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని జిల్లా రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎస్‌ఎంఏఎం  పథకంలో భాగంగా జనగాం జిల్లాకు 2025-26 సంవత్సరానికి గాను 2.73 కోట్ల బడ్జెట్ కేటాయించగా. ఈ పథకంలో బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, రోటవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికట్టె యంత్రాలు, డ్రోన్లు,ట్రాక్టర్లు, నాగలి,పవర్ టిల్లర్ పరికరాలు మంజూరయ్యాయన్నారు.

రైతులకు నచ్చిన  పరికరాన్ని ఎన్నుకొని సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు .సంబంధిత వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు కు దరఖాస్తులు ఇచ్చిన యెడల లక్ష లోపు ధర ఉన్న పరికరాలను మండల కమిటీ, లక్ష కన్నా ఎక్కువ విలువ గల పరికరాలను జిల్లా కమిటీ ద్వారా లబ్దిదారుల ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు.