పాదచారుల రక్షణకు పెలికాన్ సిగ్నల్స్
- సీపీ సజ్జనార్
- కేబీఆర్ పార్క్ వద్ద వన్‌వే పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు
జూబ్లీహిల్స్,జూలై 15(విజయక్రాంతి):కేబీఆర్ చుట్టూ జరుగుతున్న ప్రతిపాదిత వన్ వే మార్గాల పనులను వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ సీపీ సజ్జనా ర్ పరిశీలించారు. బుధవారం నిర్వహించిన క్షేత్రస్థాయి ఉమ్మడి పరిశీలనలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన నడిచారు. రోడ్లు, ప్రధాన జంక్షన్లను పరిశీలించారు. అగ్రసేక్ కూడలి, ఫి లింనగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ తదితర ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్ సరళిని తెలుసుకున్నా రు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ వన్ వే అభివృద్ధిలో పాదచారుల ర క్షణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. వారు సు రక్షితంగా రోడ్డు దాటేందుకు లేక్ మార్కింగ్ లతో పాటు పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చే యాలని నిర్మాణ సంస్థకు స్పష్టం చేశామన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఇరు కుగా ఉండటం వల్లే రద్దీ వేళల్లో ట్రాఫిక్ జా మ్ ఏర్పడుతోందని తమ పరిశీనలనలో గు ర్తించామన్నారు.త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
అనంతరం జిహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో రద్దీని నివారించేందుకు ప్రతిపాదించిన వన్వే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. హై దరాబాద్ సిటీ పోలీస్ సూచించిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పనులు జరిగే సమయంలో ప్రజలు సహకరించాలని కోరారు. నగరవాసులకు ప్రయాణ పరంగా ఇబ్బందులు కలగకుండా నిరంతరం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని వి వరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ జోయల్ డెవిస్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, ట్రాఫిక్ డీసీపీ కాజల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






