calender_icon.png 17 February, 2026 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లిలో పెద్దపట్నం

17-02-2026 01:40:38 AM

వేడుకలకు తరలివచ్చిన భక్తులు

కొమురవెల్లి, ఫిబ్రవరి 26: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి పెద్దపట్నం వేడు కలు వైభవోపేతంగా జరిగాయి. తోట భావి ప్రాంతంలో 50 మంది ఒగ్గు పూజారులు సుమారు ఐదు గంటల పాటు శ్రమించి 50 గజాలలో పట్నాన్ని రచించారు.

పంచవర్ణాలైనా పసుపు, కుంకుమ, పచ్చ( తంగేడు ఆకు తో తయారు చేసిన పొడి ) తెల్ల పిండి, బుకా గులాల్ (గులాబీ రంగు కుంకుమ) ఉపయోగించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెద్దపట్నం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. గర్భాలయం నుంచి ఆలయ అనువంశిక అర్చకులు మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను  పట్నంపై పెట్టి, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.