calender_icon.png 5 February, 2026 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.9.88 కోట్లు చెల్లించండి

05-02-2026 01:01:05 AM

సమ్మక్క సాగర్ బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ డిమాండ్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్రం లో నిర్మాణంలో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఏర్పడే బ్యాక్ వాటర్ ప్రభావాలపై సమగ్ర అధ్యయనం చేపట్టేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు అధ్యయనానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం రూ.9.88 కోట్లను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఛత్తీస్‌గఢ్ జల వనరుల శాఖ కోరింది.

ప్రాజెక్టు పూర్తి రిజర్వా యర్ స్థాయి, వెనుక నీటి ప్రవాహం కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముంపు ప్రభావం ఎంతవరకు ఉం టుందన్నది కచ్చితంగా అంచనా వేసేందుకు చేపట్టాల్సిన సమగ్ర సర్వే కోసం రూ.9.88 కోట్ల వ్యయ అంచనాను సిద్ధం చేసి తెలంగాణ ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు వెల్లడించారు. సర్వే నివేదిక ఆధారంగా అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నారు