12 July, 2026 | 1:31 AM

పాము కాటుకు రైతు మృతి

12-07-2026 12:26 AM

సంగారెడ్డి జిల్లా కడ్పల్‌లో ఘటన

సిర్గాపూర్, జూలై 11(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామానికి చెందిన  రైతు సేనంగిల సాయిలు (45) శుక్రవారం రాత్రి పాము కాటుకు గురై మృతి చెందాడు. సాయిలు పొలానికి వెళ్లిన సమయంలో పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు సిర్గాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.