14-02-2026 12:25:52 AM
శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
మహబూబాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): కోరిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న మహబూబాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలకు (మహా జాతర) ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 14న ఉదయం 9 గంటలకు పసుపు, కుంకుమలు, సాయం త్రం ఏడు గంటలకు గణపతిపూజ, పుణ్యాహవచనము, పంచగవ్యప్రాశన, కంకణధార ణ, దీక్షాధారణ, అంకురారోపణం, అఖండ దీపారధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం.
రాత్రి 10 గంటలకు బసవముద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో సత్యనారాయణ తెలిపారు.15న ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గం టల నుండి శ్రీ స్వామివారి దర్శనము, ఉద యం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీస్వామివారికి పూర్ణాభిషేకం, సాయంత్రం 4 గంటల నుండి శ్రీ స్వామివారు ఆలంకారముతో దర్శనము, పాదభిషేకము, అలాగే శివాలయము నం దు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి 12 గంటల వరకు శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామివారికి అభిషేకములు నిర్వహించబడు ను.
రాత్రి 7-00 లకు గ్రామసేవ, ఎదురుకోలు, అర్ధరాత్రి 1:50 గంటలకు (తెల్లవారితే సోమవారం) శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణమహోత్సవము నిర్వ హించనున్నారు.16న సోమవారం నుండి మంగళవారం వరకు ఉదయం 6 గంటలకు అభిషేకములు, నిత్యౌపాసన, బలిహరణ, హోమము, సేవలు, గ్రామసేవ నిర్వహిస్తారు. 18న బుధవారం సాయంత్రం 6:30 లకు తెప్పోత్సవము (కురవి పెద్ద చెఱువు నందు), 20న శుక్రవారం ఉదయం 6 గంటలకు అభిషేకములు, నిత్యౌపాసన, బలిహ రణ, సాయంత్రం 6 గంటలకు రథోత్సవ ము, 21న శనివారం అభిషేకములు, నిత్యౌపాసన, పూర్ణాహుత్రి.
బండ్లు తిరుగుట, పా రువేట, రాత్రి 10 గంటలకు ద్వజ అవరోహణ, బసవముద్ద. 22న ఆదివారం ఉద యం 5 గంటలకు దోపోత్సవము, వసంతోత్సవము, ఉదయం 11 గంటలకు కురవి పెద్ద చెరువునందు త్రిశూలస్థానం, రాత్రి 7 గంటలకు ఏకాంత సేవ, సదస్యం, నాగవెల్లి, 23న సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకములు, రాత్రి 6:30 గంటలకు శ్రీ స్వామి వారి పవళింపు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
27న శుక్రవారం ఏడు గంటలకు శివాలయములో మహన్యాస పూర్వక రుద్రాభిషేకము, రుద్రహోమము, శ్రీ పార్వ తి సమేత రామలింగేశ్వరస్వామి వారి కళ్యాణమహోత్సవము, మార్చి 1న ఆదివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం12 గంటల వరకు పూర్ణాభిషేకములు, శ్రీస్వామివారి ఆలంకరణ,పదహారు రోజుల పండుగ నిర్వహిస్తారు.
కురవి జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం నల్గొండ హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టిసి ప్రత్యేక బస్ సర్వీసులను మహబూబాబాద్ నుంచి కురవికి నడుపుతారు.