30 July, 2026 | 1:44 AM

ఆగస్త్య అగ్రో, కెమ్లీ అగ్రిటెక్ భాగస్వామ్యం

30-07-2026 12:49 AM
  1. పంట సంరక్షణ ఉత్పత్తులపై ఎంఓయూ
  2. రానున్న మూడేళ్లలో రూ.600 కోట్ల వ్యాపారంపై లక్ష్యం

సికింద్రాబాద్, జూలై 29(విజయక్రాంతి): తెలంగాణకు చెందిన ప్రముఖ అగ్రోకెమికల్ సంస్థ ఆగస్త్య అగ్రో లిమిటెడ్ (వార్షిక టర్నోవర్ రూ.300 కోట్లు), న్యూఢిల్లీకి చెందిన వి నూత్నమైన పేటెంట్ పొందిన పంట సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ కెమ్లీ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వా మ్య ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చు కుం ది. ఈ భాగస్వామ్యం ద్వారా దక్షిణ భారతదేశ రైతులకు అత్యాధునిక పేటెంట్ పొం దిన పంట సంరక్షణ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ అవగాహన ఒప్పందంపై ఆగస్త్య అగ్రో లిమిటెడ్ వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మురళి మల్లంపాటి, కెమ్లీ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ కుమార్ ఐలావధి సికింద్రాబాద్లోని ఆగస్త్య అగ్రో కార్పొరేట్ కార్యాలయంలో సంతకాలు చేశారు.ఈ భాగస్వామ్యం ద్వారా కెమ్లీ సంస్థ అభివృద్ధి చేసిన పేటెంట్ పొందిన క్రిమిసంహారకాలు, శిలీంధ్రనాశకాలు, కలుపు నివారణ మందులు, మొక్కల పెరుగుదల నియంత్రకాలు, ఎరువు లు, మొక్కల పోషక ఉత్పత్తులను ఆగస్త్య అగ్రో దక్షిణ భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రానున్న మూడు సంవత్సరాల్లో రూ.600 కోట్ల వ్యా పారం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా యి.

ఈ సందర్భంగా ఆగస్త్య అగ్రో వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మురళి మ ల్లంపాటి మాట్లాడుతూ, కెమ్లీ పేటెంట్ టెక్నాలజీని, ఆగస్త్య అగ్రో బలమైన తయారీ సామర్థ్యం విస్తృత పంపిణీ వ్యవస్థతో కలిపి రైతులకు అధునాతన, నాణ్యమైన పంట సంరక్షణ పరిష్కారాలను అందించడమే మా లక్ష్యం. ఈ భాగస్వామ్యం మా సంస్థ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నా రు. కెమ్లీ అగ్రిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ కుమార్ ఐలావధి మాట్లాడుతూ, దక్షిణ భా రతదేశంలో విస్తరించడానికి ఆగస్త్య అగ్రో సరైన భాగస్వామి. ఇరు సంస్థల బలాలను సమన్వయం చేసి రైతుల ఆదాయాన్ని పెం చే, ఆధునిక సాంకేతికత ఆధారిత పంట సం రక్షణ పరిష్కారాలను అందిస్తాము అని చెప్పారు.

వ్యూహాత్మక భాగస్వామ్యాలు, కొత్త ఉత్పత్తుల ప్రవేశం, మార్కెట్ విస్తరణ ద్వారా రాబోయే మూడు సంవత్సరాల్లో మా టర్నోవర్న్‌ను రూ.300 కోట్ల నుంచి రూ.600 కో ట్లకు పెంచుతామని విశ్వసిస్తున్నాం, అని మురళి మల్లంపాటి తెలిపారు. కార్యక్రమం లో డైరెక్టర్ వీర శ్రీనివాస్ చందూరి, వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)  సా రా నర్సయ్య, సంస్థల సీనియర్లు, ఛానెల్ భాగస్వాములు తదితరులు పాల్గొన్నారు.