18 June, 2026 | 3:39 AM

టాప్ ప్లేస్‌లో పార్ టైమర్స్

18-06-2026 02:18 AM

హైదరాబాద్, జూన్ 17: టీ గోల్ఫ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న టీ9 ఛాలెంజ్ మూడో రౌండ్ ముగిసేసరికి పార్ టైమర్స్ జట్టు 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిం ది. పూల్ ఏ నుంచి బంకర్ బస్టర్స్ (7 పాయింట్లు) రెండో స్థానంలోనూ , విసాఫ్ట్ టైటాన్స్ (7 పాయింట్లు) మూడో స్థానంలోనూ, దాసో బై మహి (5 పాయింట్లు), శ్రీమెట్రిక్స్ ఈగల్స్ (5 పాయింట్లు), రాజ్ పుష్ప ఇన్విక్టా (4 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పూల్ బి నుంచి ఆర్డీ ఐరన్ ఈగల్స్ (8 పాయింట్లు) టాప్ ప్లేస్ లో ఉండగా, ఫెయిర్ వే వారియర్స్ (6 పాయింట్లు) రెండో స్థానంలోనూ, జాగృతి జాగ్వర్స్ (6 పాయింట్లు) మూడో స్థానంలోనూ, చాముండి బౌల్డర్ హిల్స్ టైగర్స్ (5.5 పాయింట్లు) , హైదరాబాద్ గోల్ఫర్ యునైటెడ్ (5.5 పాయింట్లు), నోవాటెల్ స్టార్స్ (5 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.