సుబ్రతో కప్ సెమీస్‌లో నాసర్ స్కూల్
18-06-2026 02:19 AM
హైదరాబాద్, జూన్ 17: స్కూల్ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో సీఐఎస్‌సీఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏపీ, తెలంగాణలో భాగంగా ప్రీ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. అండర్ 17 బాలుర విభాగంలో నాసర్ స్కూర్(గచ్చిబౌలీ) సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
షేర్‌వుడ్ (పేట్ బషీరాబాద్)తో మ్యాచ్ టైగా ముగిసినప్పటకీ.. సెయింట్ జోసెఫ్ (వనస్థలిపురం), ఫ్యూచర్ కిడ్స్ స్కూల్స్‌పై సాధించిన విజయాలతో సెమీస్‌కు అర్హత సాధించింది. సెయింట్ ప్యాట్రిక్ హైస్కూల్, షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) కూడా సెమీఫైనల్స్ చేరుకున్నాయి. తొలి సెమీఫైనల్లో సెయింట్ ప్యాట్రిక్ స్కూల్, షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్, రెండో సెమీస్‌లో నాసర్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఢీకొంటాయి.






