5 August, 2026 | 2:45 AM

సేవా స్ఫూర్తిని చాటిన పారమిత విద్యార్థులు

05-08-2026 12:00 AM

ముకరంపుర, ఆగస్టు 4 (విజయ క్రాంతి): పారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇ. ప్రసాదరావు జన్మదినం సందర్భంగా పారమిత ఫిలాంత్రఫీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ, వృద్ధా శ్రమాలకు నిత్యావసర సరుకులు, నగదు సహాయాన్ని అందజేసి విద్యార్థులు సేవా స్ఫూర్తిని చాటారు. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో మంచికంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమానికి, జమ్మికుంటలో గోపరాజు వీరస్వామి ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న .

స్పందన ఆర్గనైజేషన్ వాలంటీర్ సంస్థకు పారమిత విద్యార్థులు నిత్యావసర సరుకులను అందించారు. ఇందులో 8 క్వింటాళ్ల బియ్యం, 17 కిలోల చింతపండు, 60 కిలోల పప్పు ధాన్యాలు, 35 లీటర్ల వంట నూనె ఉన్నాయి. పాఠశాల యాజమాన్యం తరఫున 50 వేల నగదు సహాయాన్ని కూడా అందించారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇ ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రశ్మిత, రాకేశ్, ప్రాచీ, అనుకర్రావు, వినోదరా వు, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు , ప్రశాంత్, బాలాజీ, గోపీకృష్ణ, శ్రీకర్, శర్మిష్ఠ, కవిత ప్రసాద్, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.