27 April, 2026 | 7:34 PM

జిల్లా అధికార ప్రతినిధిగా వసంతరావు

27-04-2026 05:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ప్రతినిధిగా "పాముల వసంతరావు ను నియమించినట్టు పార్టీ జిల్లా కన్వీనర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ తెలిపారు పార్టీ కార్యాలయంలో సోమవారం నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యలపై గళం ఎత్తడానికి వసంతరావు సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు వసంతరావు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాయి.