8 July, 2026 | 8:29 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

అగ్ని ప్రమాదంతో మొక్కజొన్న పంట దగ్ధం

27-04-2026 05:14 PM

సిరికొండ,(విజయక్రాంతి): మండలంలోని పోచం పల్లి గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. రైతు కుమరం కల బాయి కి చెందిన చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న కు ఆకస్మికంగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పైపులు, వ్యవసాయ పనికి ఉపయోగించే పరికరాలు సహా పలు వస్తువులు కాలిపోయాయి. పంటను కష్టపడి పండించి నిల్వ చేసిన సమయంలో ఇలా నష్టం కలగడంతో తీవ్ర మనోవ్యథ వ్యక్తం చేసిన కలబాయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటన చోటుచేసుకున్న వెంటనే గ్రామస్థులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే అధికారులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని రైతు కుమరం కలబాయి కోరుతున్నారు.