అఫ్గానిస్తాన్‌పై యుద్ధం ప్రకటించిన పాకిస్తాన్
27-02-2026 11:02 AM
దాడులకు దిగిన అఫ్గాన్, పాకిస్థాన్
ఇస్లామాబాద్: మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పరిస్థితులు నెలకున్నాయి. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్(Pakistan-Afghanistan war) పరస్పరం దాడులకు దిగాయి. సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్, అఫ్గాన్ దాడులు చేసుకుంటున్నాయి. కాబూల్, మరో రెండు ప్రావిన్సులపై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. అఫ్గనిస్థాన్ తో బహిరంగయుద్ధం(Pakistan declares war) ప్రారంభమైందని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. పాకిస్థాన్ పై ప్రతిదాడులు చేసినట్లు అఫ్గానిస్తాన్ ప్రతినిధులు ప్రకటించారు. పాక్ లోని అన్జార్ సార్, బబ్రాక్ పోస్టులపై దాడులు చేశామని అఫ్గాన్ తెలిపింది. 55 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు తాలిబాన్లు ప్రకటించారు. 133 మంది తాలిబాన్లను హతమార్చినట్లు పాక్ సైన్యం పేర్కొంది. గత ఆదివారం పాక్ వైమానిక దాడికి ప్రతీకారంగా అఫ్గాన్ విరుచుకుపడింది. 19 పాక్ సైనిక పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లు అఫ్గానిస్తాన్ వెల్లడించింది.




