11 June, 2026 | 3:41 AM

అఫ్గన్‌పై పాక్ దాడులు

11-06-2026 02:35 AM
  1.   13 మంది మృతి
  2. మృతుల్లో 11 మంది చిన్నారులు

ఇస్లామాబాద్, జూన్ 10: అఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ మంగళవారం అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపించింది. అఫ్గన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై, జరిగిన ఈ వైమానిక దాడుల్లో మొత్తం 26 మందిని హతమార్చినట్లు పాక్ బుధవారం తెలిపింది. అంతకు ముందు కొన్నిగంటల ముందే పాకిస్తాన్  చేసిన దాడిలో మొత్తం 13 మంది మరణించారని, ఇందులో 11 మంది చిన్నారులు  నిద్రలో మృతిచెందారని, మరో 14 మందికి గాయాలయ్యాని అఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది.

పాకిస్తాన్ --ఆఫ్గనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలోని ‘ఫిత్నా అల్ ఖ్వారిజ్‌కు చెందిన సూత్రధారులు, ప్రణాళికాకర్తల రహ స్య స్థావరాలు, సురక్షిత ప్రాం తాలపై కచ్చితమైన, ప్రణాళికాబద్ధమైన దా డులు జరిపి, 26 మంది ఖ్వారిజ్‌లను హతమార్చామని పాక్ వెల్లడించింది. ఫిత్నా అల్ ఖ్వారిజ్ కమాండర్ అలీమ్ ఖాన్ ఖుషాలి, కమాండర్ అక్తర్ ముహ్మద్ జానీ ఖేల్‌కు చెందిన ఒక శిక్షణా కేంద్రం, రహస్య స్థావరం, ఒక ఆయుధాగారం, ఒక మరాకిజ్ (కేంద్రం)తో సహా నాలుగు లక్ష్యాలను పాక్ ధ్వంసం చేసింది.

కునార్, ఖోస్ట్, పక్తి కా ప్రావిన్సులలోని పౌరుల ఇళ్లపై పాకిస్తాన్ బాంబులు వేసింది. ఈ దాడుల్లో 11 మంది పిల్లలు, ఒక మహిళ,  వృద్ధుడు మరణించారు.14 మంది మహిళలు, పిల్లలకు గాయాలయ్యాయి. సెర్పా జిల్లాలోని ఓ ఇం టిపై జరిగిన దాడిలోనే 9 మంది చనిపోయారని, మరో 10 మంది గాయపడ్డారు. పక్తికా ప్రావిన్స్‌లోని బర్మల్ జిల్లాలో జరిగిన మరోదాడిలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. నిద్రస్తున్న సమయంలో దాడులు జ రగడంతో 11 మంది చిన్నారులు నిద్రలోనే కన్నుమూశారు.