టీఎంసీకి సుష్మిత గుడ్ బై
రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా
పెద్దల సభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం
న్యూ ఢిల్లీ, జూన్ 10 (విజయక్రాంతి): తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చీలిక కొ నసాగుతుంది. మమతా బెనర్జీకి టీఎంసీ నేతలు ఆమెకు షాక్‌ల మీద షాక్‌లిస్తున్నారు. బుధవారం, రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు. మూడు రోజుల్లో ఇద్దరు టీఎంసీ ఎంపీలు పార్టీని వీడడం కలకలం రేపుతోంది.
సుష్మితాదేవ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నానన్నారు. పార్టీని, సీటును వదులుకునేందుకు తనకు వ్యక్తిగత కారణాలున్నాయని చెప్పారు. బెంగాల్ రాజకీయాలలో ప్రత్యక్షం గా పాలు పంచుకోవడం లేదని, ఎవరు ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో? తనకు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి తనకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో మంచి సంబంధాలున్నాయని చెప్పా రు. రాజీనామా అనంతరం ఢిల్లీలో సీఎం హిమంత బిశ్వ శర్మను కలిశారు.
దీంతో ఆ మె బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు నెలకొన్నాయి. బీజేపీలో చేరతారా? అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు. కాగా జూన్ 8న సుఖేందు శేఖర్ రాజ్యసభకు రాజీనామా చేయడంతో పాటు పార్టీని కూడా వీడారు. 28 మంది లోక్‌సభ ఎంపీలలో 20 మంది, 13 మంది రాజ్యసభ ఎంపీల్లో ఇద్దరు పార్టీని వీడారు. జూన్ 3న బెంగాల్‌కు టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ వర్గం రిటాబ్రతను తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఇదిలా ఉండగా, మమతా బెనర్జీ సోనియా గాంధీని కలిసిన ఒక రోజు తర్వాత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు.






