11 June, 2026 | 4:38 AM

పీఓకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్

11-06-2026 02:38 AM
  1.   21 మంది పాక్ సైనికులు మృతి?
  2. టేకాఫ్‌లో సాంకేతిక లోపంతో ప్రమాదం

ఇస్లామాబాద్, జూన్ 10: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ సమీపం లో బుధవారం పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కూలిపో యింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న సిబ్బంది అందరూ మరణించారని ఆర్మీ తెలిపింది. ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేదని పాకిస్థాన్ సైన్యానికి చెం దిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) పేర్కొంది. అ యితే మరణించిన వారి సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.

కానీ సుమారు 21 మంది పాక్ సైనికులు మృతిచెందినట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ముజఫరాబాద్‌లో స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్నిరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ పాక్ ఆర్మీ అదనపు బలగాల ను మోహరిస్తోంది. ఈ క్రమంలో పాక్ సైనికులతో ఉన్న హెలికాప్టర్ ముజఫరాబాద్ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అది కుప్పకూలింది. వెంటనే సహాయక, రక్షణ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని, బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి గల కచ్చితమైన సాంకేతిక కారణాన్ని నిర్ధారించడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయజ్ సాదిక్,  డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్ మార్షల్ అసిమ్ మునీర్ ఈ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రకటనలలో, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.