22 May, 2026 | 1:46 AM

రామ్‌కు జోడీగా..!

22-05-2026 12:22 AM

రామ్ పోతినేని హీరోగా నటించడమే కాక స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారింగా ప్రకటించిన సంగతి తెలిపిందే. సాధారణంగా లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్లతో అలరించే రామ్.. ఇప్పుడు పక్కా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం తనే స్వయంగా ఒక మంచి కథను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా ఈ జూన్ నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది.

ఇందులో రామ్ పోతినేని ‘వీరా’ అనే పవర్‌ఫుల్ కాంప్లెక్స్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. హీరోగా తనే నటిస్తూ, డైరెక్షన్ చేయడం అనేది రామ్ కెరీర్‌లోనే అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. ఇదిలావుండగా, ఈ సినిమాలో రామ్‌కు సరసన నటించే హీరోయిన్ విషయ మై ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ సర్కిళ్ల లో వైరల్ అవుతోంది. ‘కేజీఎఫ్’ చాప్టర్ 1, 2 చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారన్న దే ఆ వార్తల సారాంశం.

ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో కథానాయకి పాత్ర కు చాలా ప్రాధాన్యం ఉండటంతో శ్రీనిధిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ శ్రీనిధి శెట్టికి కథను వివ రించగా, వైవిధ్యమైన ఈ స్క్రిప్ట్ ఆమెకు బాగా నచ్చిందని సమాచారం. ప్రస్తుతం రెమ్యునరేషన్, డేట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయని టాక్. ఆమె సైన్ చేయడం.. మేకర్స్ అధికారిక ప్రకటన చే యడమే తరువాయి అన్న మాట వినవస్తోంది.