9 June, 2026 | 1:49 AM

అంగట్లో ఔట్‌సోర్సింగ్ జాబ్స్!

09-06-2026 12:15 AM
  1. ఉద్యోగాన్ని బట్టి రేటు 
  2. అమాయక యువకుల్ని బురిడీ కొట్టిస్తున్న దళారులు 
  3. ఏడాది జీతం కన్నా ఎక్కువ లంచం
  4. నిబంధనలకు నీళ్లు

నిర్మల్ జూన్ 8 (విజయక్రాంతి): ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు.. అంగట్లో సరుకులుగా మారింది. ఉన్నత చదువులు ప్రభుత్వ ఉద్యోగం రాని అమాయకుల అవసరాలు ఆసరాగా చేసుకొని ఔట్సోర్సింగ్ ఉద్యోగ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఉద్యోగం ఏదైనా. రెండు లక్షలు ఇస్తే గాని ఔట్సోర్సింగ్ ఉద్యోగం దక్కని పరిస్థితి. నిర్మల్ జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ పేరుతో ఏజెన్సీలు అమాయక యువతీ యువకులకు గాలం వేస్తూ అందినంత దోచుకుంటున్నారు.

నిర్మల్ జిల్లాలో గత ఐదు సంవత్సరాల నుంచి వివిధ రంగాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల ఏజెన్సీ నిర్వాహకులు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందే పిలిపించుకొని ఫలానా ఉద్యోగానికి ఫలానా లంచం  డిమాండ్ చేస్తున్నారు.నిర్మల్ జిల్లాలో ఔట్సోర్సింగ్ రంగంలో ప్రభుత్వం వైద్యశాలలు గురుకుల విద్యాసంస్థలు. 

ప్రభుత్వ కార్యాలయం  క్రింది స్థాయి ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగుల ఎంపిక నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో సుమారు 7 ఏజెన్సీలు పనిచేస్తుండగా500 మంది వరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు చెబుతున్నారు .

ఉద్యోగానికి ఒక రేటు 

నిర్మల్ జిల్లాలో వివిధ రంగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు  స్థాయిని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. ఇందుకు ఏజెన్సీ నిర్వాకులు తమ బంధువులను మిత్రులను తెలిసినవారిని మీడియేటర్ గా నియమించుకొని ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకు వెళ్లి ఉద్యోగం రావాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ కింద స్వీపర్లు వాచ్మెన్లు సెక్యూరిటీ గాళ్లు క్లీన్ బాయిలు వార్డ్ బాయిలు, కంప్యూటర్ ఆపరేటర్లు, అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఆపరేటర్లు అటెండర్లు స్వీపర్లు దినసరి కార్మికులు, ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్ద అక్రమాలకు పాల్పడుతున్నారు.

అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయంలో, బాసర త్రిబుల్ ఐటీ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు మ్యాన్ పవర్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి . జిల్లా వ్యాప్తంగా ఆయా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పత్రికల్లో నోటిఫికేషన్ ఇస్తున్నప్పటికీ అవి సర్కులేషన్ లేని పత్రికలకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రచారం కాకుండా జాగ్రత్త పడుతున్నారు.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ను బట్టి ఉద్యోగులకు ఎంపిక చేయాలి.

కానీ ఏజెన్సీ నిర్వాకులు అధికారులతో కుమ్మక్కై ప్రొవిజన్ జాబితాను తయారుచేసి అందులో అక్రమాలను చేస్తున్నారు. ఉద్యోగ స్థాయిని బట్టి లక్ష రూపాయలు నుంచి 3 లక్షల వరకు గుడ్ విల్ ఇస్తేనే ఉద్యోగానికి ఎంపిక చేస్తున్నారు. కార్మిక వేతనాల చట్ట ప్రకారం 14500 వరకు వేతనాలు చెల్లించాలి. వీరికి ఈఎస్‌ఐ పిఎఫ్  సౌకర్యాల కల్పించాలి. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వాటిని అమలు చేయడం లేదు.  ఉద్యోగం మానుకున్న బెనిఫిట్ రావడం లేదు.

ఏడాదికోసారి ఉద్యోగుల రెనివల్ చేసుకోవాలి. మళ్లీ   రెన్యువల్ చేయాలంటే ముడుపులు ఇవ్వాల్సిందే.  12000 వేతనాలు   ఇస్తూ ఉద్యోగ ఎంపిక మాత్రం లక్ష నుంచి 1,50,000 వరకు వసూలు చేస్తున్నారు..     వారు చెల్లించి వేతనం కంటే ఉద్యోగం కోసం వారు తీసుకున్న డబ్బులే ఎక్కువ అవుతున్నాయి. ఏడాది తర్వాత వారు నచ్చితే తిరిగి తీసుకుంటున్నారు నచ్చకపోతే కొత్తవారిని ఎంపిక చేసి వారి వద్ద మళ్లీ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఉద్యోగాలకు అర్హులైన వారు ఉంటే వారికి రూపాయి లేకుండా ఉద్యోగం ఇవ్వాలి. కానీ లంచం ఇవ్వనిది ఉద్యోగం ఇవ్వడం లేదు. ఇటీవలి ముగ్గురు యువకుల 1,50,000 వరకు ఒక ఏజెన్సీ బ్రోకర్ వాసులు  నకిలీపత్రాలను అందించారు. రాథోడ్ శ్రీకృష్ణ రాథోడ్ వికాస్ అనే ఇద్దరు యువకులు అటెండర్ పోస్ట్ కోసం బ్రోకర్ దాకా రెండు లక్షలు చెల్లించారు. ఉద్యోగం రాకపోగా ఆ రెండు లక్షల కూడా మోసపోయినట్టు గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

నిర్మల్ పట్టణంలో ఓ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో భార్యాభర్తలకు ఇద్దరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు మూడు లక్షల తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. పట్టణంలోని శాంతినగర్కు చెందిన ఇద్దరు బ్రోకర్లు వైద్య కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు వసూలు చేసి ఎనిమిది మందికి మోసం చేశారు. ప్రభుత్వ  కంప్యూటర్ ఆపరేటర్లు డేటా ఆపరేటర్లు వాచ్మెన్లు ఇతర ఉద్యోగుల కోసం కొందరు ఏజెన్సీలకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ముడుపులు ఇచ్చినట్టు. ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ వైద్యశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు అంగట్లో సరుకులుగా విక్రయిస్తున్నారు. జిల్లా తుని ఓ సీనియర్ ఉద్యోగిని తొలగించి ఇటీవలే మరో ఉద్యోగికి 2 లక్షలు లంచం తీసుకొని ఔట్సోర్సింగ్ వాచ్మెన్ పోస్టింగ్ ఇచ్చారు. కొందరు ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని అకారణంగా దొరికించి కొత్తవారిని నియమించుకుంటున్నారు. ఇదేమని అడిగితే మా ఇష్టం అంటూ సమాధానం చెబుతున్నారు ఆరోపిస్తున్నారు. పి ఎఫ్ ఐ ఈఎస్‌ఐ ఇతర అలవెన్సులు రావడం లేదు. హక్కుల కోసం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కొట్లాడితే కక్ష కట్టి వారిని ఏవో కారణాల చేత తొలగిస్తున్నారు.

అధికారు  అంతర్యం ఏమిటి 

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు అక్రమాలు జరుగుతున్నాయని నిబంధనలు పాటించడం లేదని కొందరు యువకులు ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఏజెన్సీ ఉద్యోగాలు స్థానికులకు అవకాశం ఇవ్వాలి. కానీ కొందరు పక్క జిల్లాల వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఇక్కడ వారికి నష్టం జరుగుతుంది. కార్మిక వేతనాల చట్టం కచ్చితంగా అమలు చేయాలి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కచ్చితంగా పని పీఎఫ్ ఈఎస్‌ఐ వంటి సౌకర్యం ఏజెన్సీ కల్పించాలి.

ప్రమాద బీమా వారి చెల్లించాలి. కానీ నిర్మల్ జిల్లాలో ఏజెన్సీ నిల్వకులు వీటన్నిటిని తుంగలో తొక్కుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏజెన్సీ నిల్వకులతో సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మద్దుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న అధికారులు మాత్రం కంటి తూర్పు చర్యలు తీసుకుంటున్నారు.

ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతూ ఆరోపణలు రుజువైన తిరిగి వారికి ఏజెన్సీ కాంటాక్ట్ అప్పజెప్పడం వెనుక అంతర్యం ఏమిటని కొందరు నిరుద్యోగ యువకులు ప్రశ్నిస్తున్నారు. అమాయక ప్రజలే టార్గెట్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా దీనిపై ప్రత్యేక సిద్ధపడి చర్యలు తీసుకోవాలని జిల్లా నిరుద్యోగ యువకులు కోరుతున్నారు.