24 August, 2026 | 4:50 AM

అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలి

24-08-2026 12:08 AM

ఉప్పల శ్రీనివాస్ గుప్త

నాగోల్, ఆగస్టు 23: (విజయ క్రాంతి) న్యూమారుతినగర్ రోడ్ నంబర్ 5లోని శ్రీ రేణుకాదేవి (ఎల్లమ్మ), శ్రీ విజయదుర్గాదేవి సమేత అమ్మవార్ల బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీపీసీసీ ప్ర ధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఉ ప్పల స్వప్న హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు బోనాలు సమర్పిం చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొ క్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయు రారోగ్యాలతో ఉండాలని ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆకాంక్షించారు.