మనోళ్లే ర్యాంకింగ్స్
- వన్డే నెం.1 బ్యాటర్‌గా గిల్
- టాప్ 5లో కోహ్లీ, రోహిత్
- టీ20 టాప్ ప్లేస్‌లో ఇషాన్ కిషన్
- టాప్ 50లోకి దూసుకొచ్చిన వైభవ్
దుబాయి, జూలై 29 : ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ఇటు వన్డే, అటు టీ ట్వంటీ, టెస్ట్ మూడు ఫార్మాట్లలోనే టీమిండియా ప్లేయర్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో గిల్ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో 80 , రెండో వన్డేలో 77 రన్స్‌తో సిరీస్ విజయంలో కీలకపాత్ర పో షించాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో కివీస్ ఆల్ రౌండర్ డారిల్ మిఛెల్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌ను తిరిగి కైవసం చేసుకున్నాడు.
విండీస్‌పై మిఛెల్ ఒక హాఫ్ సెంచరీకి పరిమితమ వడంతో రెండో ప్లేస్‌కు పడిపోయాడు. ఇది లా ఉంటే భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టాప్ 5లో కొనసాగుతున్నారు. కోహ్లీ 3వ ర్యాంకులోనూ, రోహిత్ 4వ ర్యాంకులోనూ ఉన్నారు. అయితే వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం టాప్ 10లో ఒక్క భారత బౌలర్ చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్ 11వ స్థానంలో ఉండగా, సిరాజ్ 22, బుమ్రా 24వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. వన్డేల్లో టాప్ బౌలర్‌గా ఆప్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నిలిచాడు.
ఇదిలా ఉంటే టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బ్యా టర్‌గా ఇషాన్ కిషన్ తన టాప్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు. వరుస వైఫల్యాలతో సతమత మవుతున్న అభిషేక్ శర్మ మూడో స్థానానికి పడిపోగా.. తిలక్ వర్మ రెండు స్థానాలు మెరు గై ఆరో ర్యాంకులో నిలిచాడు. కాగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకం గా 230 స్థానాలు ఎగబాకి టాప్ 50లోకి దూసుకొచ్చాడు. జింబాబ్వే టూర్ లో ప్లేయ ర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన వైభవ్ 151 పరుగులు చేశాడు. దీనిలో రెండు హాఫ్ సెంచరీ లున్నాయి.
ఈ ప్రదర్శనతో 48వ ర్యాంకుకు చేరుకున్నాడు. గాయంతో జింబాబ్వే టీ20 సిరీస్ మొత్తానికి దూరమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక్కడే టాప్ 10లో ఉన్నా డు. అతను 8వ ర్యాంకులో నిలిచాడు. అటు టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ 7, జైస్వా ల్ 9వ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతు న్నాడు. ఇక టీం ర్యాంకింగ్స్‌లో భారత్ వన్డే లు, టీ20లో టాప్‌లో కొనసాగుతోంది.






