కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నాయి.
మెట్రో రైలుపై ఆ పార్టీల వైఖరిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి
యాప్ లో లేని యూరియా షాపులో ఎలా ఉంటుంది?
హుజుర్ నగర్ బీఆర్.ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నరసింహారెడ్డి విమర్శలు.
నేరేడుచర్ల, జూన్ 24(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా,నేరేడుచర్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హుజుర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన, మాట్లాడుతూ.. కాంగ్రెస్ బిజెపి ఆడుతున్న కుటిల రాజకీయాలు ప్రజలందరికీ అర్థమయిపోయిందని అన్నారు.మెట్రో రైలుపై ఆ పార్టీల వైఖరిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని అని,తెలంగాణకి ఆదాయం వచ్చే వనరులన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి దానధర్మాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడన్నారు.
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గతంలో కంటే ఎక్కువ వడ్లు కొనుగోలు చేశామoటూ భజన చేసుకుంటున్నాడని, కానీ గతంతో పోలిస్తే ప్రస్తుతం కొనుగోలు శాతం తగ్గి,కేవలం 59 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు.ఇంకా రైతుల వద్ద కుప్పలు కుప్పలుగా ధాన్యం ఉందని ప్రస్తుతం ఆ దాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆరోపించారు.యాప్ లో లేని యూరియా షాపులో ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
యదేచ్చగా యూరియాను సుమారు కట్టకి 300 నుంచి 400 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుందని అన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ధాన్యం కొనమంటూ ఎన్నడు రోడ్లెక్కలేదని అని,రైతు యూరియా కావాలని ధర్నా చేసిన దాఖలాలు లేవు అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కే ఎల్ ఎన్ రెడ్డి,, సురేష్ బాబు,చెన్నబోయిన సైదులు,మాజీ మున్సిపల్ చైర్మన్ జయ బాబు,మాజీ డీసీసీబీ డైరెక్టర్, మున్సిపల్ కౌన్సిలర్ అప్పిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి,వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్లు కడియం వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.






