23 April, 2026 | 4:55 AM

మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకోవాలి

23-04-2026 12:10 AM

నిర్మల్, ఏప్రిల్ 2౨ (విజయక్రాంతి): మన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటేందుకుగాను ఇప్పటి నుంచే సంబంధిత శాఖల అధికారులందరూ తగు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ అభిలాష అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాబోవు రోజుల్లో వనమహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటేందుకు ముందస్తు ప్రణాళికలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కల వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డిఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారి ఎంఎ. రజాక్, డిఈఓ భోజన్న, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.