23 April, 2026 | 3:19 AM

సమ్మె వద్దు... విధులకు హాజరు కావాలి

23-04-2026 12:09 AM

ఆర్టీసీ సిబ్బందికి ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చర్చల ప్రక్రియను ప్రారం భిం చిందని, ఈ క్రమంలో సమ్మె చేయడం సరికాదని, యథావిధిగా కార్మికులందరూ విధులకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడి కోరారు. పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 22(1)(డీ) ప్రకారం, సంబంధిత ఒక వివాదం పెండిండ్‌లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు.