28 February, 2026 | 9:55 PM

ఆటో ఢీకొని ఒకరు మృతి

28-02-2026 02:02 AM

పాపన్నపేట, ఫిబ్రవరి27:ఆటో ఢీకొని ఒకరు మృతి చెందగా కుటుంబీకులు పోలీసులకు పిర్యాదు చేసిన సంఘటన మండల పరిధిలోని రామతీర్థం గ్రామం లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు,పోలీసులు, కుటుంబీకుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామతీర్థం గ్రామానికి చెందిన కుర్మ సాయిలు(58) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా గురువారం గ్రామంలో పలు విందులలో పాల్గొని మండల కేంద్రమైన పాపన్నపేటకు ఓ ద్విచక్ర వాహనం పై వెళుతున్న క్రమంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన ఓ ఆటో మండల కేంద్రమైన పాపన్న పేట నుండి స్వగ్రామానికి అతివేగంగా వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం పై ఉన్న సాయిలును ఢీ కొనడంతో కిందపడి గాయాలు కావడంతో ఆటో చోదకుడు క్షతగాత్రుణ్ణి చికిత్స నిమిత్తం పాపన్నపేట ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి

ఇంటివద్ద వదిలి వెళ్ళగా రాత్రి నిద్రించిన మృతుడు శుక్రవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబీకులు వెళ్ళి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గమనించి వెంటనే గ్రామస్తుల సహకారంతో పాపన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో పాపన్నపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుడి భార్య నాగమణి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడికి భార్య నాగమణి ముగ్గురు కుమారులు ఉన్నారు.