28 February, 2026 | 11:40 PM

86 గ్రాముల హైడ్రోపోనిక్ గంజా పట్టివేత

28-02-2026 02:01 AM

మునిపల్లి, ఫిబ్రవరి 27గోవా నుండి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాను మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవా నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మీదుగా హైదరాబాద్కు గుట్టు చప్పుడు కాకుండా హైడ్రోపోనిక్ గంజాను తరలిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందింది.

దీంతో శుక్రవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ప్రొహిబిషన్, ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ కాసిమ్ ఐఎఎస్ ఆదేశాల మేరకు మెదక్ డీసీ జె.హరికిషన్ పర్యవేక్షణలో ఏసీ జి.శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాస్ రావు నేతృత్వంలో మెదక్ ఎన్ఫోర్స్మెంట్ బృందం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీ చేయగా అందులో కేరళకు చెందిన బ్రెయిన్ బాబు అనే వ్యక్తి వద్ద 86 గ్రాముల హైడ్రోపోనిక్ గంజా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు వృత్తిరీత్యా ఈవెంట్ ఆర్గనైజర్గా పనిచేస్తూ, పార్టీల కోసం ఈ మత్తు పదార్థాన్ని తరలిస్తున్నట్లు అధికారులు వివరించారు.

ఈ మేరకు నిందితుడిపై ఎన్డిపీఎస్ చట్టం 1985 కింద కేసు నమోదు చేయడంతో పాటు ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన 86గ్రాముల హైడ్రోపోనిక్ గంజా విలువ సుమారు రూ. 3.5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ తనిఖీలో సీఐ గాంధీ నాయక్, ఎస్‌ఐ బి.యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎం.డి. అలీమ్, కానిస్టేబుళ్లు అమ్మతుల్ కరీమ్, రామారావు నాయక్, ఎం. గోపాల్, వివేక్, ముజమ్మిల్, వి.కావ్య తదితరులు ఉన్నారు.